9581319000 info@paripurnananda.com WhatsApp
శ్రావణ మంగళ గౌరీ వ్రతం

శ్రావణ మంగళ గౌరీ వ్రతం

Pooja Price / Dakshina Ask Me

శ్రావణ మంగళ గౌరీ వ్రతం

శ్రావణ మంగళ గౌరీ వ్రతం విధానం

శ్రావణ మాసం మందు ఆచరించ వలసిన వ్రతములలో మొదటిది మంగళగౌరీ వ్రతం నెలలో వచ్చే నాలుగు మంగళవరాలు మంగళ గౌరీని పూజించాలి. పార్వతి దేవికి మరొక పేరు (గౌరీ ) మంగళ గౌరీ. సాధారణంగా కొత్తగా పెళ్ళయిన ముత్తైదువలు వ్రతాన్ని చేస్తారు. వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. వ్రతాన్నిగురించి స్వయంగా శ్రీ కృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి.

శ్రావణ మంగళ గౌరీ వ్రతం విధానం లేదా మంగళ గౌరీ పూజ ఏవిధంగా జరుపుకోవాలో మంత్ర పూర్వకంగా, వివరణతో క్రింది విధంగా తెలుపబడినది.

పూజావిధానం : ఒక శుభ్రమైన పీటను పసుపు కుంకుములతో అలంకరించి, దాని పైన ఒక ఎండు కొబ్బరి చిప్పలో పసుపుతో చేసిన గౌరీదేవిని అలంకరించాలి. పసుపు వినాయకుడిని కూడా అలంకరించాలి. ముందుగా వినాయక పూజ చేయాలి. కలశం ప్రతిష్ఠించే సంప్రదాయం ఉన్నవారు కలశాన్ని పెట్టి, కలశ పూజగావించాలి. ముందుగా వినాయకుడికి నైవేద్యం సమర్పించాక, మంగళ గౌరి లేక ఫణి గౌరి దేవి అష్టోత్తరం చదివి, అమ్మవారి ముందు 5 ముడులు, 5 పొరలు కలిగిన, 5 తోరాలు, 5 పిండి దీపారాధనలు (బియ్యం పిండి, బెల్లం మిశ్రమంతో చేసిన దీపాలు) పెట్టి పూజించాలి. పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి, హారతి ఇచ్చి, అమ్మవారి దగ్గర పూజ లో పెట్టిన ఒక తోరం చేతికి కట్టుకోవాలి. పిండి దీపారాధనలు కూడా….ఒకటి అమ్మవారికి, ఒకటి మనకి (పూజ చేసినవారు), మిగిలిన 3 ముత్తయిదువలకు తాంబూలంతో పాటు ఇవ్వాలి.

Note:

వ్రతం చేసుకున్న మరు నాడు కూడా అమ్మవారికి హారతి ఇచ్చి, నైవేద్యం పెట్టి యధాస్థానం ప్రవేశయామి, పూజార్ధం పునరాగమ నాయచః అని అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి. అంటే అమ్మా నీ స్వస్థానానికి వెళ్లి, మళ్లీ పూజకి మమ్మల్ని అను గ్రహించు అని అర్ధం. అంతటితో ఒక వారం వ్రతం సంపూర్ణం అవుతుంది. పసుపు కుంకుమల సౌభాగ్యం కోసం, సత్సంతానం కోసం, అన్యోన్యదాంపత్యం కోసం మంగళ గౌరీ వ్రతాన్ని చేస్తారు.

#ItemQuantity
1పసుపు50 గ్రాములు
2కుంకుమ100 గ్రాములు
3దారం1
4 గంధం (చిన్న డబ్బా)
5అగరబత్తి1 ప్యాకెట్
6కర్పూరం 1 ప్యాకెట్
7దీపారాధన నూనె 1/4 లీటర్
8వత్తులు1 ప్యాకెట్
9బియ్యం3 కిలోలు
10తువ్వాళ్లు (తెలుపు)2
11జాకెట్ పీస్2
12రాగి చెంబు1
13కొబ్బరికాయలు 3
14వక్కలు50 గ్రాములు
15ఖర్జూరం50 గ్రాములు
16 నాణేలు 30
17తమలపాకులు 35
18పువ్వులు1/2 కిలో ( 6 మూరలులేదా దేవుళ్ల ఫోటోలకు సరిపడా)
19పండ్లుఅరటిపండ్లు 12 (ఇతర పండ్లు (3 రకాల లేదా 5 రకాల) - 3 X 3 లేదా 5 X 5)
20మామిడి ఆకులుకొన్ని
21ప్రసాదంఇంట్లో తయారుచేసిన ప్రసాదాలు
22 చిత్రపటం లేదా ప్రతిమ.1
23గిన్నె  కొబ్బరి నీళ్ల కోసం
24ఏక హారతి1
25గంట1
26తువ్వాలు చేతులు తుడుచుకోవడానికి
27పంచ పాత్ర2
28 దీపారాధన కుందులు2
29దర్భలుకొన్ని
30 పంచామృతంపాలు పెరుగు తేనె నెయ్యి పంచదార
31 పళ్లెం 2,పూజా ద్రవ్యాలు ఉంచడానికి
32పీటలు లేదా ఆసనాలు కూర్చోడాని
33
Pooja Document
Featured Partner

Vedic Astrology Consultations

Speak with certified Astrologers

Book Consult

PDF Viewer

Booking Schedule

Please fill in your details to book this pooja service.
Please login to book this pooja.
Home Panchang Book Pooja Donations Menu