9581319000 info@paripurnananda.com WhatsApp
సంకటహర చతుర్థి ‬పూజ

సంకటహర చతుర్థి ‬పూజ

Pooja Price / Dakshina Ask Me

సంకటహర చతుర్థి పూజ

గణపతి కి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిది. అయితే చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరించెదరు. మొదటిది వరదచతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి . అమావాస్య తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను వరదచతుర్థి అని, పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి / సంకటహర చతుర్థి వ్రతం అంటారు. ఇందులో వరదచతుర్థి ని వినాయక వ్రతం గా వినాయక చవితి రోజున ఆచరించెదరు. సంకటములను తొలించే సంకట హర చతుర్థి వ్రతంను మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు.

ఒకవేళ సంకష్ట హర చతుర్థి మంగళవారం కాని వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం. అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం  ఆచరించడం వల్ల జాతకములోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా, చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరునని ప్రతీతి.

ప్రతిమాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తరువాత 3,4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయమునకు(సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణించాలి. అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా గమనించాలి.

Note:

సంకటహర చతుర్థి ‬ వ్రత పూజా విధానం : సంకష్టహరచవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలపాటు ఆచరించాలి. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. వ్రతాచరణ రోజున ప్రాతఃకాలమే శిరస్సున స్నానం చేసి, తరువాత గణపతిని పూజించాలి. అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు, కుంకుమలతో అలంకరణను చేయాలి. మనస్సులోని కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి. సంకటనాశన గణేశ స్తోత్రం, సంకట హర చతుర్థి వ్రత కథను చదవవలెను. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి. శక్త్యానుసారము గరిక పూజను కాని, గణపతి హోమమును కాని చేయిన్చుకోనవచ్చును. సూర్యాస్తమయం వరకూ పూజ చేసిన వినాయకుడిని కడపరాదు. సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి.

#ItemQuantity
1పసుపు50 గ్రాములు
2కుంకుమ50 గ్రాములు
3దారం1
4 గంధం (చిన్న డబ్బా)
5అగరబత్తి1 ప్యాకెట్
6కర్పూరం 1 ప్యాకెట్
7దీపారాధన నూనె 1/4 లీటర్
8వత్తులు1 ప్యాకెట్
9బియ్యం3 కిలోలు
10తువ్వాళ్లు (తెలుపు)2
11జాకెట్ పీస్2
12రాగి చెంబు1
13కొబ్బరికాయలు 3
14వక్కలు50 గ్రాములు
15ఖర్జూరం50 గ్రాములు
16 నాణేలు 30
17తమలపాకులు 35
18పువ్వులు1/2 కిలో ( 6 మూరలులేదా దేవుళ్ల ఫోటోలకు సరిపడా)
19పండ్లుఅరటిపండ్లు 12 (ఇతర పండ్లు (3 రకాల లేదా 5 రకాల) - 3 X 3 లేదా 5 X 5)
20మామిడి ఆకులుకొన్ని
21ప్రసాదంఇంట్లో తయారుచేసిన ప్రసాదాలు
22 చిత్రపటం లేదా ప్రతిమ.1
23గిన్నె  కొబ్బరి నీళ్ల కోసం
24ఏక హారతి1
25గంట1
26తువ్వాలు చేతులు తుడుచుకోవడానికి
27పంచ పాత్ర2
28 దీపారాధన కుందులు2
29దర్భలుకొన్ని
30 పంచామృతంపాలు ,పెరుగు, తేనె ,నెయ్యి ,పంచదార.
31 పళ్లెం 2,పూజా ద్రవ్యాలు ఉంచడానికి
32పీటలు లేదా ఆసనాలు కూర్చోడాని
Pooja Document
Featured Partner

Vedic Astrology Consultations

Speak with certified Astrologers

Book Consult

PDF Viewer

Booking Schedule

Please fill in your details to book this pooja service.
Please login to book this pooja.
Home Panchang Book Pooja Donations Menu