శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం
₹ Ask Me
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం
ఏడాదిలో ఏ శుభదినాన అయినా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోవచ్చు. వైశాఖ, కార్తిక, మాఘ మాసాలలో చేస్తే ఎంతో శుభం. మాససంక్రాంతులలో, ఏకాదశి, పూర్ణిమ తిథుల్లో చేసుకుంటే మంచి ఫలితాన్నిస్తుంది. ఏ శుభకార్యాన్నైనా ఆరంభించే ముందు లేదా ఇంట్లో శుభకార్యం చేసుకున్న తరువాత ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. పగలు లేదా సాయంత్రం ఎప్పుడైనా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. సాయంత్రం చేసే పూజ మరింత ఫలదాయకం. ఈ వ్రతాన్ని ఇంట్లోనూ చేసుకోవచ్చు. దేవాలయాలలో, పుణ్యక్షేత్రాలలో, నదీతీరంలో, సాగర సంగమం వద్ద చేస్తే వేయింతల ఫలం లభిస్తుంది. ఈ వ్రతాన్ని కుల, లింగ, వర్గాలతో సంబంధం లేకుండా ఎవరైనా చేసుకోవచ్చు. అవివాహితలు, బ్రహ్మచారులు, విధవలు, విధురులు సైతం ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. తదనుగుణంగా సంకల్పం చెప్పుకోవాలి. ఇంటిలో ఏదైనా అశుభం జరిగినప్పుడు అంటే ఏటిసూతకం వంటివి ఉన్నప్పుడు ఏడాది లోపల ఈ వ్రతాన్ని చేసుకోకపోవడమే మంచిది. సూతకం తీరినవెంటనే చేయవచ్చు.
ఏ ఇతర వ్రతానికీ లేని ఆకర్షణ శక్తి సత్యనారాయణ స్వామి వ్రతానికి ఉంది. ఏ ఇంట పెళ్లిపేరంటం జరిగినా మొదటిగా సత్యనారాయణ వ్రతం చేస్తారు. పెళ్లితంతు పూర్తికాగానే నూతన దంపతులు గృహస్థధర్మంలో ప్రవేశించేముందుగా ఈ వ్రతాన్ని చేయడం ఆచారం. గృహప్రవేశం సమయంలోనూ భార్యాభర్తలిద్దరూ కలిసి ఈ వ్రతాన్ని చేస్తారు. సాధారణంగా దంపతీయుక్తంగా ఆలుమగలిద్దరూ కలిసి చేసుకునే ఈ వ్రతం తప్పనిసరి పరిస్థితుల్లో ఒంటరిగా చేసుకోవచ్చు. అన్నవరంలోనూ, ఇతర పుణ్యక్షేత్రాల్లోనూ సామూహిక సత్యనారాయణ వ్రతాలు విరివిగా జరుగుతుంటాయి. విష్ణుప్రియమైన వైశాఖ, కార్తిక, మాఘమాసాల్లోనూ ఈ వ్రతాన్ని ఎక్కువగా ఆచరిస్తారు.
Note:
అన్నవరంలోని శ్రీసత్యనారాయణ స్వామి ఆలయం పంచాయతన పద్ధతిలో నిర్మించారు. అందుకే ఈ వ్రతంలో పంచలోక పాలక పూజ చేస్తారు. అలాగే త్రిమూర్తులు ముగ్గురినీ పూజించిన ఫలితం సత్యదేవుని పూజతో కలుగుతుంది. అష్టదిక్కులకు అధిపతులైన అష్టదిక్పాలకులను, నవగ్రహాలను తాంబూలాలతో పూజించడం ఈ వ్రతంలోని ప్రత్యేకత. అందుకే ఈ వ్రతంతో దేవతలందరినీ పూజించిన సంతృప్తి కలుగుతుంది.| Sl.No | Item | Quantity |
|---|---|---|
| 1 | పసుపు | 50 గ్రాములు |
| 2 | కుంకుమ | 50 గ్రాములు |
| 3 | దారం | 1బాల్ |
| 4 | గంధం | (చిన్న డబ్బా) |
| 5 | అగరబత్తి | 1 ప్యాకెట్ |
| 6 | కర్పూరం | 1 ప్యాకెట్ |
| 7 | దీపారాధన నూనె | 1/4 లీటర్ |
| 8 | వత్తులు | 1 ప్యాకెట్ |
| 9 | బియ్యం | 3 కిలోలు |
| 10 | తువ్వాళ్లు (తెలుపు) | 2 |
| 11 | జాకెట్ పీస్ | 2 |
| 12 | రాగి చెంబు | 1 |
| 13 | కొబ్బరికాయలు | 3 |
| 14 | వక్కలు | 50 గ్రాములు |
| 15 | ఖర్జూరం | 50 గ్రాములు |
| 16 | నాణేలు | 30 |
| 17 | తమలపాకులు | 35 |
| 18 | పువ్వులు | 1/2 కిలో ( 6 మూరలులేదా దేవుళ్ల ఫోటోలకు సరిపడా) |
| 19 | పండ్లు | అరటిపండ్లు 12 (ఇతర పండ్లు (3 రకాల లేదా 5 రకాల) - 3 X 3 లేదా 5 X 5) |
| 20 | మామిడి ఆకులు | కొన్ని |
| 21 | తులసి దళాలు | కొన్ని |
| 22 | ప్రసాదం | గోధుమ రవ్వ కేసరి లేదా రవ్వ కేసరి |
| 23 | స్వామి వారి చిత్రపటం లేదా ప్రతిమ. | 1 |
| 24 | గిన్నె | కొబ్బరి నీళ్ల కోసం |
| 25 | ఏక హారతి | 1 |
| 26 | గంట | 1 |
| 27 | తవ్వాలు | చేతులు తుడుచుకోవడానికి |
| 28 | పంచ పాత్ర | 2 |
| 29 | దీపారాధన కుందులు | 2 |
| 30 | దర్భలు | కొన్ని |
| 31 | పంచామృతం | పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార |
| 32 | పళ్లెం | పూజా ద్రవ్యాలు ఉంచడానికి |
| 33 | ||
| 34 | ||
| 35 | ||
| 36 | ||
| 37 | ||
| 38 | ||
| 39 |