• 9581319000
  • info@paripurnananda.com



శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

₹ Ask Me

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 

ఏడాదిలో ఏ శుభదినాన అయినా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోవచ్చు. వైశాఖ, కార్తిక, మాఘ మాసాలలో చేస్తే ఎంతో శుభం. మాససంక్రాంతులలో, ఏకాదశి, పూర్ణిమ తిథుల్లో చేసుకుంటే మంచి ఫలితాన్నిస్తుంది. ఏ శుభకార్యాన్నైనా ఆరంభించే ముందు లేదా ఇంట్లో శుభకార్యం చేసుకున్న తరువాత ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. పగలు లేదా సాయంత్రం ఎప్పుడైనా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. సాయంత్రం చేసే పూజ మరింత ఫలదాయకం. ఈ వ్రతాన్ని ఇంట్లోనూ చేసుకోవచ్చు. దేవాలయాలలో, పుణ్యక్షేత్రాలలో, నదీతీరంలో, సాగర సంగమం వద్ద చేస్తే వేయింతల ఫలం లభిస్తుంది. ఈ వ్రతాన్ని కుల, లింగ, వర్గాలతో సంబంధం లేకుండా ఎవరైనా చేసుకోవచ్చు. అవివాహితలు, బ్రహ్మచారులు, విధవలు, విధురులు సైతం ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. తదనుగుణంగా సంకల్పం చెప్పుకోవాలి. ఇంటిలో ఏదైనా అశుభం జరిగినప్పుడు అంటే ఏటిసూతకం వంటివి ఉన్నప్పుడు ఏడాది లోపల ఈ వ్రతాన్ని చేసుకోకపోవడమే మంచిది. సూతకం తీరినవెంటనే చేయవచ్చు.


ఏ ఇతర వ్రతానికీ లేని ఆకర్షణ శక్తి సత్యనారాయణ స్వామి వ్రతానికి ఉంది. ఏ ఇంట పెళ్లిపేరంటం జరిగినా మొదటిగా సత్యనారాయణ వ్రతం చేస్తారు. పెళ్లితంతు పూర్తికాగానే నూతన దంపతులు గృహస్థధర్మంలో ప్రవేశించేముందుగా ఈ వ్రతాన్ని చేయడం ఆచారం. గృహప్రవేశం సమయంలోనూ భార్యాభర్తలిద్దరూ కలిసి ఈ వ్రతాన్ని చేస్తారు. సాధారణంగా దంపతీయుక్తంగా ఆలుమగలిద్దరూ కలిసి చేసుకునే ఈ వ్రతం తప్పనిసరి పరిస్థితుల్లో ఒంటరిగా చేసుకోవచ్చు. అన్నవరంలోనూ, ఇతర పుణ్యక్షేత్రాల్లోనూ సామూహిక సత్యనారాయణ వ్రతాలు విరివిగా జరుగుతుంటాయి. విష్ణుప్రియమైన వైశాఖ, కార్తిక, మాఘమాసాల్లోనూ ఈ వ్రతాన్ని ఎక్కువగా ఆచరిస్తారు.

Note:
అన్నవరంలోని శ్రీసత్యనారాయణ స్వామి ఆలయం పంచాయతన పద్ధతిలో నిర్మించారు. అందుకే ఈ వ్రతంలో పంచలోక పాలక పూజ చేస్తారు. అలాగే త్రిమూర్తులు ముగ్గురినీ పూజించిన ఫలితం సత్యదేవుని పూజతో కలుగుతుంది. అష్టదిక్కులకు అధిపతులైన అష్టదిక్పాలకులను, నవగ్రహాలను తాంబూలాలతో పూజించడం ఈ వ్రతంలోని ప్రత్యేకత. అందుకే ఈ వ్రతంతో దేవతలందరినీ పూజించిన సంతృప్తి కలుగుతుంది.
Sl.No Item Quantity
1 పసుపు 50 గ్రాములు
2 కుంకుమ 50 గ్రాములు
3 దారం 1బాల్
4 గంధం (చిన్న డబ్బా)
5 అగరబత్తి 1 ప్యాకెట్
6 కర్పూరం 1 ప్యాకెట్
7 దీపారాధన నూనె 1/4 లీటర్
8 వత్తులు 1 ప్యాకెట్
9 బియ్యం 3 కిలోలు
10 తువ్వాళ్లు (తెలుపు) 2
11 జాకెట్ పీస్ 2
12 రాగి చెంబు 1
13 కొబ్బరికాయలు 3
14 వక్కలు 50 గ్రాములు
15 ఖర్జూరం 50 గ్రాములు
16 నాణేలు 30
17 తమలపాకులు 35
18 పువ్వులు 1/2 కిలో ( 6 మూరలులేదా దేవుళ్ల ఫోటోలకు సరిపడా)
19 పండ్లు అరటిపండ్లు 12 (ఇతర పండ్లు (3 రకాల లేదా 5 రకాల) - 3 X 3 లేదా 5 X 5)
20 మామిడి ఆకులు కొన్ని
21 తులసి దళాలు కొన్ని
22 ప్రసాదం గోధుమ రవ్వ కేసరి లేదా రవ్వ కేసరి
23 స్వామి వారి చిత్రపటం లేదా ప్రతిమ. 1
24 గిన్నె   కొబ్బరి నీళ్ల కోసం
25 ఏక హారతి 1
26 గంట 1
27 తవ్వాలు చేతులు తుడుచుకోవడానికి
28 పంచ పాత్ర 2
29 దీపారాధన కుందులు 2
30 దర్భలు కొన్ని
31 పంచామృతం పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార
32 పళ్లెం పూజా ద్రవ్యాలు ఉంచడానికి
33
34
35
36
37
38
39
64 Views Book Now