విజయదశమి
₹ Ask Me
విజయదశమి విశిష్టత
దసరా లేదా విజయ దశమి అనేది నవరాత్రి పండుగలో పదవ
రోజు దేవదానవులు పాలసముద్రాన్ని మధించినప్పుడు ఈ రోజునే అమృతం
ఉద్భవించిందని ఇతిహాసాలు చెబుతున్నాయి. ఈ సమయం సర్వకార్యసాధకమైనదిగా పరిగణించబడుతుంది.
ఇది శ్రవణా నక్షత్రంతో కలిసినప్పుడు ప్రత్యేకంగా విజయదశమి అని పిలుస్తారు.
విజయదశమి పూజా విధానం
- ఉదయం 5 గంటలకు లేచి శుచిగా తలస్నానం చేయాలి.
- ఎర్రటి వస్త్రాలు ధరించాలి.
- పూజామందిరం, ఇంటిని శుభ్రం చేసి, గడపకు పసుపు రాసి,
కుంకుమ బొట్లు పెట్టి రంగురంగుల ముగ్గులు వేయాలి.
- రాజరాజేశ్వరి, దుర్గాదేవి ప్రతిమలను నల్లకలువలు, ఎర్రటి
పుష్పాలతో అలంకరించాలి.
- నైవేద్యానికి పొంగలి, పులిహోర తయారుచేయాలి.
- 9 వత్తులతో కూడిన నువ్వుల దీపాన్ని సిద్ధం చేయాలి.
పూజా క్రమం • రాజరాజేశ్వరి అష్టకం, మహిషాసుర సంహారిణి అష్టకాన్ని పఠించాలి. • వీలు లేకపోతే ‘శ్రీ మాత్రే నమః’ మంత్రాన్ని 108 సార్లు జపించి, కర్పూర హారతులు సమర్పించాలి. ఆలయాల ప్రత్యేక పూజలు • విజయదశమి నాడు ఆలయాల్లో రాజరాజేశ్వరి అష్టోత్తర పూజ, లలితసహస్రనామం, కోటికుంకుమార్చన వంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. • ముత్తైదువులకు తాంబూలంతో పాటు రాజరాజేశ్వరి నిత్యపూజ, దేవి భక్తి మాల వంటి పుస్తకాలను ఇవ్వడం దీర్ఘ సుమంగళీ యోగానికి మార్గం. ఈ విధంగా విజయదశమి పూజలు జరుపుకోవడం ద్వారా సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు.
Note:
దసరా నైవేద్యములు నైవేద్యములు ఇవే పెట్టాలి అని నియమము ఏమీ లేదు కానీ ఒక పధ్దతిగా ఈ నైవేద్యములు పెట్టచ్చు. పాడ్యమి రోజు శ్రీ దుర్గాదేవి - చలిమిడి, వడపప్పు, పాయసం విదియ రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి . తీయటి బూంది, శనగలు తదియ రోజు శ్రీ గాయత్రీ దేవి . రవ్వకేసరి, పులిహోర చవితి రోజు శ్రీ అన్నపూర్ణాదేవి . పొంగలి పంచమి రోజు శ్రీ లలితా దేవి . పులిహోర పెసరబూరెలు. షష్టి రోజున శ్రీ మహాలక్ష్మి దేవి . బెల్లం లేదా పంచధార తో చేసిన క్షీరాన్నం సప్తమి రోజు శ్రీ సరస్వతి దేవి (మూలా నక్షత్రం రోజున) అటుకులు, కొబ్బరి, శనగపప్పు, బెల్లం అష్ఠమి రోజు శ్రీ దుర్గాదేవి (దుర్గాష్ఠమి) గారెలు, నిమ్మరసం కలిపిన అల్లం ముక్కలు నవమి రోజు శ్రీ మహిషాసురమర్ధిని (మహర్నవమి) చక్రపొంగలి దశమి రోజు శ్రీ రాజరాజేశ్వరీదేవి (విజయ దశమి-దసరా) పులిహోర, గారెలు దసరా మహోత్సవములు నవరాత్రి అలంకారములు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి శ్రీ స్వర్ణకవచ దుర్గాదుర్గాదేవి ఆశ్వయుజ శుద్ధ విదియ శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి ఆశ్వయుజ శుద్ధ తదియ శ్రీ గాయత్రి దేవి - శ్రీ గాయత్రి అష్టోత్తర శతనామావళి ఆశ్వయుజ శుద్ధ చవితి శ్రీ అన్నపూర్ణా దేవి ఆశ్వయుజ శుద్ధ పంచమి శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి ఆశ్వయుజ శుద్ధ షష్ఠి శ్రీ మహాలక్ష్మిదేవి ఆశ్వయుజ శుద్ధ సప్తమి శ్రీ సరస్వతీ దేవి(మూలానక్షత్రం) ఆశ్వయుజ శుద్ధ అష్టమి శ్రీ దుర్గా దేవి ఆశ్వయుజ శుద్ధ నవమి( మహర్నవమి) శ్రీ మహిషాసురమర్ధినీ దేవి ఆశ్వయుజ శుద్ధ దశమి (విజయదశమి) శ్రీ రాజరాజేశ్వరి దేవి తిథి నక్షత్రములను బట్టి అలంకారములు మారవచ్చును. ఏ రోజు ఏ దేవి అలంకారిన్ని, అవతారాన్ని పూజిస్తారో ఆరోజు ఆ దేవి అష్టోత్తరము చదువవలెను| Sl.No | Item | Quantity |
|---|---|---|
| 1 | పసుపు | 100 గ్రాములు |
| 2 | కుంకుమ | 250 గ్రాములు |
| 3 | దారం | 1 |
| 4 | గంధం | (చిన్న డబ్బా) |
| 5 | అగరబత్తి | 1 ప్యాకెట్ |
| 6 | కర్పూరం | 1 ప్యాకెట్ |
| 7 | దీపారాధన నూనె | |
| 8 | వత్తులు | 1 ప్యాకెట్ |
| 9 | బియ్యం | 3 కిలోలు |
| 10 | తువ్వాళ్లు (తెలుపు) | 2 |
| 11 | జాకెట్ పీస్ | 2 |
| 12 | రాగి చెంబు | 1 |
| 13 | కొబ్బరికాయలు | 3 |
| 14 | వక్కలు | 50 గ్రాములు |
| 15 | ఖర్జూరం | 50 గ్రాములు |
| 16 | నాణేలు | 30 |
| 17 | తమలపాకులు | 35 |
| 18 | పువ్వులు | 1/2 కిలో ( 6 మూరలులేదా దేవుళ్ల ఫోటోలకు సరిపడా) |
| 19 | పండ్లు | అరటిపండ్లు 12 (ఇతర పండ్లు (3 రకాల లేదా 5 రకాల) - 3 X 3 లేదా 5 X 5) |
| 20 | మామిడి ఆకులు | కొన్ని |
| 21 | ప్రసాదం | ఇంట్లో తయారుచేసిన ప్రసాదాలు |
| 22 | చిత్రపటం లేదా ప్రతిమ. | |
| 23 | గిన్నె | కొబ్బరి నీళ్ల కోసం |
| 24 | ఏక హారతి | 1 |
| 25 | గంట | |
| 26 | తువ్వాలు | చేతులు తుడుచుకోవడానికి |
| 27 | పంచ పాత్ర | 2 |
| 28 | దీపారాధన కుందులు | 2 |
| 29 | దర్భలు | కొన్ని |
| 30 | పంచామృతం | పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార |
| 31 | పళ్లెం | 2,పూజా ద్రవ్యాలు ఉంచడానికి |
| 32 | పీటలు లేదా ఆసనాలు | కూర్చోడాని |