శ్రావణ మంగళ గౌరీ వ్రతం
₹ Ask Me
శ్రావణ మంగళ గౌరీ వ్రతం
శ్రావణ
మంగళ గౌరీ వ్రతం విధానం
శ్రావణ
మాసం మందు ఆచరించ వలసిన
వ్రతములలో మొదటిది ఈ మంగళగౌరీ వ్రతం
ఈ నెలలో వచ్చే నాలుగు మంగళవరాలు మంగళ గౌరీని పూజించాలి.
పార్వతి దేవికి మరొక పేరు (గౌరీ
) మంగళ గౌరీ. సాధారణంగా కొత్తగా పెళ్ళయిన ముత్తైదువలు ఈ వ్రతాన్ని చేస్తారు.
ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన
ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్నిగురించి స్వయంగా
శ్రీ కృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి.
శ్రావణ
మంగళ గౌరీ వ్రతం విధానం
లేదా మంగళ గౌరీ పూజ
ఏవిధంగా జరుపుకోవాలో మంత్ర పూర్వకంగా, వివరణతో క్రింది విధంగా తెలుపబడినది.
పూజావిధానం : ఒక శుభ్రమైన పీటను పసుపు కుంకుములతో అలంకరించి, దాని పైన ఒక ఎండు కొబ్బరి చిప్పలో పసుపుతో చేసిన గౌరీదేవిని అలంకరించాలి. పసుపు వినాయకుడిని కూడా అలంకరించాలి. ముందుగా వినాయక పూజ చేయాలి. కలశం ప్రతిష్ఠించే సంప్రదాయం ఉన్నవారు కలశాన్ని పెట్టి, కలశ పూజగావించాలి. ముందుగా వినాయకుడికి నైవేద్యం సమర్పించాక, మంగళ గౌరి లేక ఫణి గౌరి దేవి అష్టోత్తరం చదివి, అమ్మవారి ముందు 5 ముడులు, 5 పొరలు కలిగిన, 5 తోరాలు, 5 పిండి దీపారాధనలు (బియ్యం పిండి, బెల్లం మిశ్రమంతో చేసిన దీపాలు) పెట్టి పూజించాలి. పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి, హారతి ఇచ్చి, అమ్మవారి దగ్గర పూజ లో పెట్టిన ఒక తోరం చేతికి కట్టుకోవాలి. పిండి దీపారాధనలు కూడా….ఒకటి అమ్మవారికి, ఒకటి మనకి (పూజ చేసినవారు), మిగిలిన 3 ముత్తయిదువలకు తాంబూలంతో పాటు ఇవ్వాలి.
Note:
వ్రతం చేసుకున్న మరు నాడు కూడా అమ్మవారికి హారతి ఇచ్చి, నైవేద్యం పెట్టి యధాస్థానం ప్రవేశయామి, పూజార్ధం పునరాగమ నాయచః అని అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి. అంటే అమ్మా నీ స్వస్థానానికి వెళ్లి, మళ్లీ పూజకి మమ్మల్ని అను గ్రహించు అని అర్ధం. అంతటితో ఒక వారం వ్రతం సంపూర్ణం అవుతుంది. పసుపు కుంకుమల సౌభాగ్యం కోసం, సత్సంతానం కోసం, అన్యోన్యదాంపత్యం కోసం మంగళ గౌరీ వ్రతాన్ని చేస్తారు.| Sl.No | Item | Quantity |
|---|---|---|
| 1 | పసుపు | 50 గ్రాములు |
| 2 | కుంకుమ | 100 గ్రాములు |
| 3 | దారం | 1 |
| 4 | గంధం | (చిన్న డబ్బా) |
| 5 | అగరబత్తి | 1 ప్యాకెట్ |
| 6 | కర్పూరం | 1 ప్యాకెట్ |
| 7 | దీపారాధన నూనె | 1/4 లీటర్ |
| 8 | వత్తులు | 1 ప్యాకెట్ |
| 9 | బియ్యం | 3 కిలోలు |
| 10 | తువ్వాళ్లు (తెలుపు) | 2 |
| 11 | జాకెట్ పీస్ | 2 |
| 12 | రాగి చెంబు | 1 |
| 13 | కొబ్బరికాయలు | 3 |
| 14 | వక్కలు | 50 గ్రాములు |
| 15 | ఖర్జూరం | 50 గ్రాములు |
| 16 | నాణేలు | 30 |
| 17 | తమలపాకులు | 35 |
| 18 | పువ్వులు | 1/2 కిలో ( 6 మూరలులేదా దేవుళ్ల ఫోటోలకు సరిపడా) |
| 19 | పండ్లు | అరటిపండ్లు 12 (ఇతర పండ్లు (3 రకాల లేదా 5 రకాల) - 3 X 3 లేదా 5 X 5) |
| 20 | మామిడి ఆకులు | కొన్ని |
| 21 | ప్రసాదం | ఇంట్లో తయారుచేసిన ప్రసాదాలు |
| 22 | చిత్రపటం లేదా ప్రతిమ. | 1 |
| 23 | గిన్నె | కొబ్బరి నీళ్ల కోసం |
| 24 | ఏక హారతి | 1 |
| 25 | గంట | 1 |
| 26 | తువ్వాలు | చేతులు తుడుచుకోవడానికి |
| 27 | పంచ పాత్ర | 2 |
| 28 | దీపారాధన కుందులు | 2 |
| 29 | దర్భలు | కొన్ని |
| 30 | పంచామృతం | పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార |
| 31 | పళ్లెం | 2,పూజా ద్రవ్యాలు ఉంచడానికి |
| 32 | పీటలు లేదా ఆసనాలు | కూర్చోడాని |
| 33 |