సంకటహర చతుర్థి పూజ
₹ Ask Me
సంకటహర చతుర్థి పూజ
గణపతి
కి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిది. అయితే ఈ చవితి లేదా
చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరించెదరు. మొదటిది వరదచతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి . అమావాస్య తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను వరదచతుర్థి
అని, పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను సంకష్టహర
చతుర్థి / సంకటహర చతుర్థి వ్రతం అంటారు. ఇందులో వరదచతుర్థి ని వినాయక వ్రతం
గా వినాయక చవితి రోజున ఆచరించెదరు. సంకటములను తొలించే సంకట హర చతుర్థి
వ్రతంను మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు.
ఒకవేళ సంకష్ట హర చతుర్థి మంగళవారం
కాని వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు. అలా
కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం.
అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి
వ్రతం ఆచరించడం వల్ల జాతకములోని కుజదోష
సమస్యలు తొలగడంతో పాటుగా, చేసే పనులలో సంకటములన్నీ
తొలగి సఫలత చేకూరునని ప్రతీతి.
ప్రతిమాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తరువాత 3,4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయమునకు(సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణించాలి. అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా గమనించాలి.
Note:
సంకటహర చతుర్థి వ్రత పూజా విధానం : సంకష్టహరచవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలపాటు ఆచరించాలి. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. వ్రతాచరణ రోజున ప్రాతఃకాలమే శిరస్సున స్నానం చేసి, తరువాత గణపతిని పూజించాలి. అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు, కుంకుమలతో అలంకరణను చేయాలి. మనస్సులోని కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి. సంకటనాశన గణేశ స్తోత్రం, సంకట హర చతుర్థి వ్రత కథను చదవవలెను. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి. శక్త్యానుసారము గరిక పూజను కాని, గణపతి హోమమును కాని చేయిన్చుకోనవచ్చును. సూర్యాస్తమయం వరకూ పూజ చేసిన వినాయకుడిని కడపరాదు. సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి.| Sl.No | Item | Quantity |
|---|---|---|
| 1 | పసుపు | 50 గ్రాములు |
| 2 | కుంకుమ | 50 గ్రాములు |
| 3 | దారం | 1 |
| 4 | గంధం | (చిన్న డబ్బా) |
| 5 | అగరబత్తి | 1 ప్యాకెట్ |
| 6 | కర్పూరం | 1 ప్యాకెట్ |
| 7 | దీపారాధన నూనె | 1/4 లీటర్ |
| 8 | వత్తులు | 1 ప్యాకెట్ |
| 9 | బియ్యం | 3 కిలోలు |
| 10 | తువ్వాళ్లు (తెలుపు) | 2 |
| 11 | జాకెట్ పీస్ | 2 |
| 12 | రాగి చెంబు | 1 |
| 13 | కొబ్బరికాయలు | 3 |
| 14 | వక్కలు | 50 గ్రాములు |
| 15 | ఖర్జూరం | 50 గ్రాములు |
| 16 | నాణేలు | 30 |
| 17 | తమలపాకులు | 35 |
| 18 | పువ్వులు | 1/2 కిలో ( 6 మూరలులేదా దేవుళ్ల ఫోటోలకు సరిపడా) |
| 19 | పండ్లు | అరటిపండ్లు 12 (ఇతర పండ్లు (3 రకాల లేదా 5 రకాల) - 3 X 3 లేదా 5 X 5) |
| 20 | మామిడి ఆకులు | కొన్ని |
| 21 | ప్రసాదం | ఇంట్లో తయారుచేసిన ప్రసాదాలు |
| 22 | చిత్రపటం లేదా ప్రతిమ. | 1 |
| 23 | గిన్నె | కొబ్బరి నీళ్ల కోసం |
| 24 | ఏక హారతి | 1 |
| 25 | గంట | 1 |
| 26 | తువ్వాలు | చేతులు తుడుచుకోవడానికి |
| 27 | పంచ పాత్ర | 2 |
| 28 | దీపారాధన కుందులు | 2 |
| 29 | దర్భలు | కొన్ని |
| 30 | పంచామృతం | పాలు ,పెరుగు, తేనె ,నెయ్యి ,పంచదార. |
| 31 | పళ్లెం | 2,పూజా ద్రవ్యాలు ఉంచడానికి |
| 32 | పీటలు లేదా ఆసనాలు | కూర్చోడాని |