
శ్రీశైలం-మల్లికార్జున జ్యోతిర్లింగం
మల్లికార్జున జ్యోతిర్లింగం - ఆంధ్రప్రదేశ్ (శ్రీశైలం)
మల్లికార్జున జ్యోతిర్లింగం శ్రీశైలం అనే పవిత్ర క్షేత్రంలో ఉంది. ఇది భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో రెండవదిగా భక్తుల మన్ననలు పొందింది ,అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా కూడా విఖ్యాతి చెందింది.. నల్లమల అడవుల మధ్యలో, కృష్ణా నదీ తీరంలో ఉన్న ఈ ఆలయాన్ని "దక్షిణ కాశి" అని కూడా పిలుస్తారు. కృష్ణానది ఈ ప్రాంతంలో పాతాళగంగా ప్రవహిస్తున్నదని పురాణాల ద్వారా తెలుస్తుంది.
ఆలయ విశేషాలు
• మల్లికార్జున స్వామి ఆలయం ద్రావిడ శిల్పకళకు ప్రత్యేకమైన ఉదాహరణ. గోపురాలు, మండపాలు, మరియు శిల్పాలు ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి.
• ఆలయంలోని భ్రమరాంబికా దేవి భారతదేశంలో 18 శక్తిపీఠాలలో ఒకటిగా పూజించబడుతుంది.
• వందలాది ఘంటల మ్రోగు శబ్దం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది.
• ఇది జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం రెండింటి కలయిక కలిగిన అరుదైన పుణ్యక్షేత్రం.
• శ్రీశైలంలోని నల్లమల అడవులు ప్రకృతిని ఆస్వాదించడానికి ఎంతో అనుకూలమైనవి.
₹ Ask Me
History:
శ్రీశైలం స్థలపురాణం పార్వతీ పరమేశ్వరులు భ్రమరాంబ సహిత మల్లికార్జునులుగా శ్రీశైల శిఖరంపై స్వయంభువుగా వెలిశారని స్థలపురాణం చెబుతుంది. పురాణ కథనం ప్రకారం, భూ ప్రదక్షిణ ఎవరు ముందు చేస్తే వారికే గణాధిపత్యం అన్న మాట విన్న కుమారస్వామి (షన్ముఖుడు) తన యాత్ర
Timings:
Opening hours: 4:30Am-10 Pm
Importance:
ముఖ్య ఉత్సవాలు • మహాశివరాత్రి మరియు కార్తిక పౌర్ణమి సమయంలో దర్శనం ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. ఈ రోజుల్లో లక్షలాది భక్తులు శ్రీశైలానికి చేరుకుంటారు. • పూజ మరియు సేవలు: ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడానికి ముందస్తు బుకింగ్ అవసరం.Note:
భక్తి ప్రయోజనాలు ఈ స్థలపురాణం వలన శ్రీశైలం క్షేత్రానికి ఆధ్యాత్మికంగా మహా ప్రాముఖ్యత ఉంది. భ్రమరాంబ, మల్లికార్జునుల దర్శనంతో భక్తుల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. ఈ స్థలాన్ని దర్శించిన వారు భక్తి, శాంతి, మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సును పొందుతారని విశ్వాసం.శ్రీశైల మల్లికార్జునేశ్వరుడు భక్తుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి, ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదిస్తుంటాడు.