• 9581319000
  • info@paripurnananda.com



ధ్యానం-మనోనియంత్రణకు మార్గం

  • Meditation, Path To Mind Control, Mindfulness, Mental Discipline, Self-control, Inner Peace, Stress Management, Focus Improvement

ధ్యానం-మనోనియంత్రణకు మార్గం

పరిచయం:

రోజుల్లో మన జీవితం చాలా వేగంగా సాగుతోంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంతవరకూ మనం ఫోన్లు, సోషల్ మీడియాలో మునిగిపోయి, చదువు, పని, రిలేషన్షిప్స్, ఫ్యూచర్ టెన్షన్లు ఇలా ఎన్నో సమస్యలతో పోరాడుతూనే ఉంటాం.

"ధ్యానం మనస్సును శాంతపరచే మందుదాన్ని ప్రతి రోజు తీసుకోండి!"

అశాంతిని తగ్గించాలంటే మన మైండ్ని కంట్రోల్ చేసుకోవడం చాలా అవసరం. ఇదే మనోనియంత్రణ.

ఇది సాధ్యమవుతుందా?

 అవును! "ధ్యానం" ద్వారా.

ధ్యానం అంటే ఏంటి?

"ధ్యానం" అనే పదం విన్నప్పుడు కొందరికి పుట్టే భావనలు:

·        అదేమో వృద్ధులు చేసే సాధనలా ఉంది

·        సద్గురు, బాబాలు చేసే పని అనిపిస్తుంది

·        ధ్యానానికి టైం ఎక్కడ? టైట్ షెడ్యూళ్లు ఉన్నాయి!

అయితే నిజానికి ధ్యానం అంటేమన మైండ్ను ఒక చోట కేంద్రీకరించడం.
సింపుల్గా చెప్పాలంటే:
ఫోన్ నోటిఫికేషన్లు లేకుండా, బయట శబ్దం లేకుండా, కళ్లూ మూసుకొని మన శ్వాస మీద ఫోకస్ చేయడమే ధ్యానం.

ఎందుకు మనం ధ్యానం చేయాలి?

పాయింట్లు మీ జీవితానికి హత్తుకొని ఉంటాయి:

1. మైండ్ కంట్రోల్ కోసం:

ఒక్క నోటిఫికేషన్ వచ్చినా మన మనసు డైవర్ట్ అయిపోతుంది. ధ్యానం వల్ల ఫోకస్ మెరుగవుతుంది. చదువులో కాని, వర్క్లో కాని ఎక్కువ కాన్సన్ట్రేషన్ వస్తుంది.

2. స్ట్రెస్ తగ్గుతుంది:

ఏం చదవాలో, ఏం పని చేయాలో, జీవితంలో ఏం కావాలో తెలియక చిన్న వయసులోనే టెన్షన్ ఎక్కువ. ధ్యానం చేస్తే మైండ్ కూల్ అవుతుంది. డెసిషన్లు తేలికగా తీసుకోగలుగుతాం.

3. రిలేషన్షిప్స్ బాగుంటాయి:

కోపం, అసహనం, మూడ్ స్వింగ్స్ఇవి రిలేషన్లను చెడగొడతాయి. ధ్యానం వల్ల మనం బాగా ఆలోచించి మాట్లాడటం, స్పందించడం నేర్చుకుంటాం.

4. నిద్ర బాగా పడుతుంది:

ఒత్తిడితో నిద్ర బాగా పట్టదు. కానీ రోజూ కాస్త సమయం ధ్యానం చేయడం వల్ల నిద్ర నాణ్యత మెరుగవుతుంది.

ఎలా ప్రారంభించాలి?

అందరికీ తెలిసిన "మీం క్రియేట్ చేయడం" ఎంత ఈజీగా ఉంటుందో, అంతే ఈజీగా ధ్యానం చేయొచ్చు. మొదట చిన్న స్టెప్స్తో మొదలుపెట్టండి.

1,శుభ్రమైన ప్రదేశం:

వాయువు బాగుండే స్థలంలో కూర్చోండి. ఫోన్ సైలెంట్ లో పెట్టండి.

2. శ్వాసపై దృష్టి పెట్టండి:

మీ కళ్లను మూసుకొని, మీరు లోపలికి తీసుకుంటున్న శ్వాసబయటికి వదులుతున్న శ్వాస మీద ఫోకస్ చేయండి. కనీసం 5 నిమిషాలు శ్వాసపై దృష్టి పెట్టండి.

3. ఆలోచనలు వస్తే ఎగ్నోర్ చేయండి:

"అయో! మెసేజ్ కి రిప్లై ఇవ్వలేదేమో!" లాంటి ఆలోచనలు వస్తే బయపడకండి. అవి సహజం. మళ్లీ మళ్లీ శ్వాసపై దృష్టి పెట్టండి. ఇదే అభ్యాసం.

4. consistency Is Key:

రోజూ ఒకే టైమ్లో చేయండి. ఉదయం లేచిన వెంటనే లేదా రాత్రి నిద్రకు ముందు.

ప్రాక్టికల్ ఉదాహరణలు:

·        ఒక స్టూడెంట్ టాపిక్ మీదైనా కన్సెన్ట్రేట్ చేయలేకపోతున్నాడు. రోజూ 10 నిమిషాలు ధ్యానం చేస్తే, దృష్టి క్రమంగా మెరుగవుతుంది.

·        ఉద్యోగి ఎక్కువ వర్క్ ప్రెషర్తో స్ట్రెస్ఫుల్గా ఉన్నాడు. ధ్యానం వల్ల అతని మైండ్ కూల్గా మారి, పని మీద మరింత ఫోకస్ పెరుగుతుంది.

·        స్మార్ట్ఫోన్ అడిక్షన్ ఉన్న యువతి, 15 నిమిషాల ధ్యానం ద్వారా ఫోన్ మీద ఆధారపడే అలవాట్లను తగ్గించగలిగింది.

ధ్యానం = మైండ్ ఫిట్నెస్

జిమ్కు వెళ్లడం శరీరానికి ఫిట్నెస్ అయితే,
ధ్యానం మనస్సు కోసం ఫిట్నెస్!

మనశ్శక్తిని ఎవరూ వెలకట్టలేరు. కానీ మనం దాన్ని నియంత్రించుకోలేకపోతే, అది మన జీవితాన్నే డిస్ట్రాయ్ చేస్తుంది.

ధ్యానం అంటే జాడ్యంగా కూర్చోవడం కాదు
ఇది మీ బ్రెయిన్కి రిలాక్స్ ఇచ్చే పవర్ మూమెంట్!

ముగింపు:

కాలంలో మెదడు మీద ఒత్తిడి చాలా ఉంది. డిజిటల్ ప్రపంచంలో మనసు దిశకూ పరుగెడుతుంది. అలాంటి సమయంలో ధ్యానం ఒక బ్రేక్ లాగా పనిచేస్తుంది. ఇది మన జీవితాన్ని ఆరోగ్యంగా, ఆనందంగా, స్పష్టతతో నడిపిస్తుంది.

ప్రతి రోజు కనీసం 10 నిమిషాలు మీకు మీరు ఇచ్చుకోండి. ధ్యానం చేయండి. ఫలితాలు మీరు చూసే ముందు, మీకు మీరే ఫీల్ అవుతారు.

 

Share the post

About Author

User Image
Radha Krishna Sharma

Life Is A Sacred Journey Where The Soul, Eternal And Pure, Takes Different Forms But Never Perishes. True Peace Comes When We Realize This Eternal Truth And Rise Above The Illusions Of Attachment And Desire. By Walking The Path Of Dharma, Practicing Compassion, Selfless Service, And Meditation, We Align Ourselves With The Divine Energy Of The Universe. Chanting Om, The Primordial Sound, Calms The Mind And Connects Us With The Source Of Creation. When We Live With Purity, Devotion, And Detachment, We Discover That Real Happiness Lies Not In The Outer World But In The Blissful Silence Of The Inner Self.

Comments

Leave Comment