నిద్రా ముద్రాంకింతమైన మీ కన్నుల
నిద్రా
ముద్రాంకింతమైన మీ కన్నుల నీటు జూడగ గల్గెను
నిద్రా ముద్రాంకింతమైన
మీ కన్నుల నీటు జూడగ గల్గెను
నిద్రా ముద్రాంకింతమైన
మీ కన్నుల నీటు జూడగ గల్గెను
భద్రాద్రి
నిలయ మా పాలి దైవమ
భద్రాద్రి నిలయ మా పాలి దైవమ రామ
భద్ర సీతా మనో పద్మభృంగ నీదు
నిద్రా ముద్రాంకింతమైన
మీ కన్నుల నీటు జూడగ గల్గెను
నిద్రా ముద్రాంకింతమైన
మీ కన్నుల నీటు జూడగ గల్గెను
తళుకు ముంగురులచే దిలకము మెఱయగ
కలికిచూపులు గుల్కగా
తళుకు ముంగురులచే దిలకము మెఱయగ
కలికిచూపులు గుల్కగా
వలనొప్పుగా చంద్రవదనమందున
వలనొప్పుగా చంద్రవదనమందున
నవ్వు మొలకలెత్తగ
ముద్దు ముఱియుచుండెడు నీదు
నిద్రా ముద్రాంకింతమైన
మీ కన్నుల నీటు జూడగ గల్గెను
నిద్రా ముద్రాంకింతమైన
మీ కన్నుల నీటు జూడగ గల్గెను
మదనుని విల్లన మహిమ దీపించు నీ మంచి కన్బొమలతీరు
మదనుని విల్లన మహిమ దీపించు నీ మంచి కన్బొమలతీరు
సదమలమైన నీ చక్కని చెక్కిళ్ళు
సదమలమైన నీ చక్కని చెక్కిళ్ళు
మొదలు మేఘముబోలు
మృదు గాత్రమున నీదు
నిద్రా ముద్రాంకింతమైన
మీ కన్నుల నీటు జూడగ గల్గెను
నిద్రా ముద్రాంకింతమైన
మీ కన్నుల నీటు జూడగ గల్గెను
వరహేమ మకుట పావన కుండలంబులు వైజయంతిక మాలలు
వరహేమ మకుట పావన కుండలంబులు వైజయంతిక మాలలు
కఱకు బంగరు చేలకాంతులు దీపింప
కఱకు బంగరు చేలకాంతులు దీపింప
నరసింహదాసు ఏమరక సేవించెడి
నిద్రా ముద్రాంకింతమైన
మీ కన్నుల నీటు జూడగ గల్గెను
నిద్రా ముద్రాంకింతమైన
మీ కన్నుల నీటు జూడగ గల్గెను
భద్రాద్రి నిలయ మా పాలి దైవమ
భద్రాద్రి నిలయ మా పాలి దైవమ రామ
భద్ర సీతా మనో పద్మభృంగ నీదు
నిద్రా ముద్రాంకింతమైన
మీ కన్నుల నీటు జూడగ గల్గెను
నిద్రా ముద్రాంకింతమైన
మీ కన్నుల నీటు జూడగ గల్గెను
నీటు జూడగ గల్గెను
నీటు జూడగ గల్గెను

Comments